గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (17:05 IST)

గలిజేరు తీగ పొడి.. పాలలో కలిపి తీసుకుంటే..?

వంటికి నీరు పట్టడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా గగ్భిణీ స్త్రీలలో నీరు పట్టడం అనారోగ్యం... వీటికి ఎవరిమటుకు వారే చికిత్సలు చేసుకోవచ్చు. అల్లాన్ని మెత్తగా దంచి చిక్కగా రసాన్ని తీసి దానిలో కొంచెం తీసుకుంటుంటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. 
 
పిప్పిళ్ళను నేతిలో వేయించి, మెత్తగా దంచాలి. శొంఠిని కూడా నిప్పుల మీద కాల్చి, మెత్తగా దంచి, రెంటిని సమానంగా కలిపి, బెల్లంతో నూరి తింటే.. శరీరానికి నీరు లాగేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి తగ్గిపోతుంది.
 
గలిజేరు తీగ పొలంగట్లు మీద పెరుగుతుంది. దీనిని తెచ్చి బాగా ఎండబెట్టి మెత్తగా దంచుకోవాలి. దీనిని పాలలోగానీ, మజ్జిగలో గానీ కలుపుకుని తాగుతుంటే.. శరీరానికి పట్టిన నీరులాగేస్తుంది. గలిజేరు, ముల్లంగి రసం కలిపి తాగుతుంటే.. కామెర్ల వ్యాధిలో నీరు పట్టడాన్ని అరికడుతుంది. 
 
నేలవేమును బాగా పొడిచేసి దీనిని సమానంగా శొంఠిని తీసుకుని బెల్లంతో నూరి కుంకుడు గింజలతం మాత్రలు చేసుకుని రోజుకు రెండుపూటలా వేసుకుంటుంటే.. వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
పునర్ణవారిష్ట, రోహితకారిష్ట, శాశీసభస్మ, మండూరభస్మ, లోహభస్మ, కోక్షురాది చూర్ణం, చంద్ర ప్రభావటి, స్వర్ణవంగం, త్రివంగభస్మ.. వీటిని వాడుతున్నా శరీరానికి పట్టిన నీరు లాగేస్తుంది.