సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (14:44 IST)

లవంగాల చూర్ణానికి జీలకర్ర చూర్ణం కలిపి అక్కడ పూసుకుంటే...

వంటకాల తయారీలో రుచికి, సువాసనకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యంగానే కాక దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకములైన అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ఔషధం లవంగాలు. ఇది మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో ఉంచే లక్షణం లవంగంలో ఉంది. లవంగాన్ని వేయించి ఔషధంలా వాడుకోవాలి. లవంగం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని పావు టీ స్పూను నెయ్యి, అర టీస్పూను తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.
 
2. లవంగాల చూర్ణంలో తగినంత నీరు చేర్చి మెత్తగా నూరి ముక్కుపై లేపనంగా పూస్తే ముక్కుదిబ్బడ సమస్య తగ్గుతుంది.
 
3. లవంగాల పొడి, జాజికాయల పొడి, జీలకర్ర పొడి, పంచదారలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక గ్రాము పొడిని తగినంత తేనె కలిపి సేవించడం వల్ల రక్తవిరేచనాలు, జిగురు, బంక, కడుపునొప్పితో కూడిన విరేచనాలు, విరేచనాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు కావడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
 
4. లవంగాల చూర్ణానికి సమానంగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకుని ప్రతిరోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల సమస్య పోతుంది.
 
5. ఐదు మి.లీ నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగగొట్టి వేసి ఆ నూనెను వేడి చేసి చల్లారాక రెండు మూడు చుక్కల నూనెను చెవిలో వేసుకోవడం వలన చెవిపోటు తగ్గుతుంది.