శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:52 IST)

రస సింధూరంలో ఏలకులు కలిపి తీసుకుంటే అవన్నీ మటాష్...

రస సింధూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచు దీనిని తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు చెక్ పెట్టవచ్చను. ఆయురేద్వం ప్రకారం రస సింధూరం తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. రస సింధూరమును పిప్పలి చూర్ణం, తేనెలతో సేవించిన వాతం, మధుమేహ వ్యాధి నశించును. చక్కెరతో తీసుకున్న యెడల పైత్య మేహం నివారిస్తుంది. రస సింధూరమును పిప్పళ్లు, మిరియాలు, శొంఠి, తేనెతో తీసుకుంటే.. శ్వాసకోశ వ్యాధులు, శూలలు నివారిస్తాయి. 
 
2. లవంగాలు, కుంకుమ పువ్వు, ఆకుపత్రి, పిప్పళ్ళు, బంగియాకు.. వీటిని ఒక్కొక్క భాగముగను, పచ్చకర్పూరము, నల్లమందు, నాగభస్మం వీటిని అర్దభాగముగా తీసుకుని బాగా నూరి దీనితో రస సింధూరమును తీసుకుంటే.. మంచి బలాన్ని, ధాతుపుష్టని కలిగిస్తుంది.
 
3. రస సింధూరము, లవంగాలు, నేలవేము కరక్కాయలను సేవించిన ఎటువంటి జ్వరమైనా నివారణమవుతుంది. రస సింధూరమును శిలాజితు, ఏలకులు, కలకండంతో సేవించిన మూత్ర సంబంధ వ్యాధులు నివారిస్తాయి. 
 
4. రస సింధూరమును బంగియాకు, వాములతో కలిపి తీసుకుంటే.. వాంతులను అరికడుతుంది. మోదుగ గింజలు నాలుగు వంతులు, బెల్లమును ఎనిమిది వంతులు తీసుకుని వీటితో రస సింధూరమును తీసుకుంటే.. క్రిముల సంబంధమైన రోగములు వెంటనే నివారిస్తాయి.
 
5. రస సింధూరమును తిప్పసత్తుతో కలిపి తీసుకుంటే.. దేవపుష్టిని కలిగిస్తుంది. ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. నల్లమందు, లవగాలు, బంగియాకులతో రస సింధూరమును తీసుకుంటే అతి సారవ్యాధులు నశిస్తాయి.