1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. After eaten food what we have to do..

భోజనానంతరం నిద్రిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

eaten
భోజనం తరువాత నిదానంగా వంద అడుగులు నడవాలి. దీనివలన త్వరగా.. భుజించిన ఆహారం జీర్ణమగును. మెడ, మోకాళ్ళు, నడుము మొదలగు అవయవములకు మంచి కలుగును. భోజనం చేసి తరువాత, భుక్తాయాసముతో కూర్చున్నవారికి పొట్ట పెరుగుతుంది. నడుము వాల్చి పడుకున్న వారికి బలం కలుగుతుంది. పరుగెత్తుట, వ్యాయామం చేయుట చెడు ఫలితాలనిస్తుంది.
 
రాత్రివేళ భోజనం చేసిన తరువాత.. ఎనిమిద ఉశ్వాస, నిశ్వాసములు కలుగువరకూ వెల్లకిల పడుకోవాలి. తరువతాత పదహారు ఉశ్వాస, నిశ్వాసలు వచ్చేంతవరకు కుడిప్రక్కకు పడుకోవాలి. తరువాత ముప్పయు రెండు ఉశ్వాస, నిశ్వాసలు కలిగే వరకూ ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. తరువాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చును. నాభిపైన ఎడమప్రక్కన జఠరాన్ని ఉంటుంది. కాబట్టి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది.
 
నిద్రపోవుటకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి. గాలి బాగుండుట వలన తాపం, పిత్తం, చెమట, మూర్చ, దప్పి మొదలగు వాటిని పోగొడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. తూర్పు నుండి వీయు గాలివలన.. రక్తపిత్తములను హరించును. కఫ, క్షయరోగులకు మంచిని చేస్తుంది. చర్మవ్యాధులు, మూలవ్యాధి, ఉబ్బసం ఉన్నవారికి మంచిదికాదు. దక్షిణపుగాలి రక్తపిత్తములను హరించును. నేత్రములకు మేలు చేయును. వాతమును హెచ్చించును. కాబట్టి వీరికి మంచిదికాదు.
తర్వాతి కథనం
ఈ పాయసాలు.... పురుషులకు భేషుగ్గా పనిచేస్తాయి...