1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of eggplant

వంకాయ ఆకుల రసంలో తేనెను కలుపుకుని తీసుకుంటే?

వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియాని

eggplant
వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. షుగర్ వ్యాధులతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతుంది.
 
వంకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ను ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. 
 
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. నరాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆకలిని పెంచుటలో వంకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అమరావతి రాజధానికి రూ.5 లక్షలు విరాళమిచ్చిన ఎన్నారైలు, ఏపీ ఉద్యోగులు రూ.30 లక్షలు