పాలలో బెల్లం కలుపుకుని తీసుకుంటే?
బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలల బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. పొటాషియం శర
బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యం చేస్తుంది. కండరాలను పెంచడంతో పాటు పటిష్టంగా ఉంచుతుంది.
శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని హీమోగ్లోబిన్ ప్రమాణాన్ని పెంచుతుంది. రక్తహీనతను తగ్గించే ఐరన్ శాతం బెల్లంలో ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్త కణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. బెల్లం ప్రతిరోజూ తీసుకోవడం వలన శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్స్, మినరల్స్ ఇందులో అధికంగా ఉంటాయి.
రక్తపోటు, గుండెజబ్బు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైన ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్లు షుగర్ లెవల్స్ దృష్టిలో పెట్టుకుని బెల్లంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.