శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (15:28 IST)

పండ్ల రసంలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే...

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు.

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు. అవి కూడా అవిసె గింజల పొడితో. ఇందులో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో శరీర బరువును సులభంగా తగ్గవచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు.
 
* అవిసె గింజల పొడిని వెజిటబుల్ సూప్‌లలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. 
* ఈ పొడిని కలుపుకుని బ్రెడ్, కుకీస్ వంటి ఆరగించినట్టయితే ప్రయోజనం ఉంటుంది. 
* ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు. 
 
* ఓట్స్‌ను ఉడికించి వాటిపై ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలను చల్లుకుని తింటే మంచిది. 
* పండ్ల రసంలో ఒక టేబుల్ స్పూన్ పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. 
* చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసెగింజల పొడి కలిని ఆరగించినా బరువు తగ్గిపోతారు.