1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Health benefits with Badam milk with roses

గులాబీ రేకులతో బాదంపప్పు పాలు కలిసి తీసుకుంటే? (Video)

Health benefits
గులాబీ పుష్పం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో సాయపడుతుంది. శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది. గులాబీతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో చూద్దాం.
 
గులాబీ రేకులు, బాదంపప్పు పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.
 
గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింపచేస్తుంది.
 
గులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తున్నాయని ఆయుర్వేద వైద్యనిపుణులు వక్కాణిస్తున్నారు.
 
గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్‌-జల్‌ని తయారుచేస్తారు. ఇది కంటి జబ్బులకి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది.

 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కరోనా వేళ.. వాకింగ్ చేస్తే ఏంటి ఫలితం? (video)