శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (19:27 IST)

గంజి నీటిని పారబోస్తున్నారా? (video)

Boiled Rice Water
అన్నం ఉడికించిన తర్వాత గంజి నీటిని పారబోస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. గంజిలో వున్న ఉపయోగాలు తెలిస్తే.. అలా ఆ నీటి పారబోయరు. ఆ గంజి నీటిలో కాస్త ఉప్పు కాస్త నీటిని చేర్చి తాగితే శక్తి లభిస్తుంది. ఇంకా డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ నీటిని ఇవ్వడం ఎంతో మంచిది. శారీరక ఎదుగుదలలేని పిల్లలకు గంజినీళ్లు తాగిస్తే మంచిది. 
 
పాలు తాగనని మారం చేసే పసిపిల్లలకు గంజనీళ్లను అలవాటు చేయాలి. దీంతో వారికి కావాల్సిన ఆహారం సరిగ్గా అంది శక్తి లభిస్తుంది. చర్మంపై దురద, మంట లాంటి సమస్యలు ఎదురైతే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి సున్నితంగా మర్దన చేయాలి. దీంతో ఎలాంటి దురద ఉండదు. 
 
విటమిన్ల లోపం ఉన్నవాళ్లు గంజిని తాగితే సరిపోతుంది. ఇందులో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే పోషణ గంజి ద్వారా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.