1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Drumstick leaves health benefits

ఈ 8 పాయింట్లు తెలిస్తే మునగాకుని తింటారంతే (Video)

Drumstick leaves
మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్థాలను, కాయగూరలను తింటూ ఉంటాం. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఒక దివ్య ఔషదంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మునగాకు జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మధుమేహగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇంతేకాదు, మరెన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే ఈ మునగాకులోని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం.
 
1. అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి మునగాకు అద్భుతంగా సహాయపడుతుంది. అందుకు ఒక గుప్పెడు మునగాకును వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత, ఈ నీటిని త్రాగాలి. ఇది మీ బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
2. మునగాకులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండి మీ ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. అంతేకాకుండా మునగాకులో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే..... ఇది శృంగార వాంఛను పెంచుతుంది.
 
3. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
 
4. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురుమీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. 
 
5. మునగాకులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో వేసుకుని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 
6. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
 
7. ఒక టేబుల్ స్పూన్ మునగాకు ఫేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు ఖాళీ కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
 
8. మునగాకు ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది.  ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

 
About Writer
సిహెచ్