గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:23 IST)

లేత కానుగ ఆకులను ముద్దగా నూరి నువ్వుల నూనెతో... (video)

ప్రకృతి మనకు అందిచిన మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాంటివాటిలో కానుగచెట్టు ఒకటి. 
 
కానుగ గింజలను, దిరిశన గింజలను చూర్ణంచేసి తేనె, నెయ్యిలను కలిపి తీసుకుంటే ఉన్మాదాలకు మంచి మందుగా పనిచేస్తుంది. శరీరాంతర్గత రక్తస్రావాన్ని ఆపే శక్తి కానుగకు వుంది. కానుగ గింజలను మెత్తగా నూరి తేనెతోనూ, నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే అలాంటి రక్తస్రావం ఆగిపోతుంది.
 
బాహ్యాభ్యంతర రక్తస్రావం తగ్గేందుకు కానుగ గింజలను మెత్తగా నూరి వేడిచేసిన ఉప్పును కలిపి పెరుగుమీద తేటతో మూడురోజులపాటు తీసుకుంటే ఆ రక్తస్రావం నిలిచిపోతుంది.
 
లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి, సుఖ విరేచనమై అర్శమొలలు తగ్గుతాయి.
 
కానుగ చెట్టు పుల్లతో పళ్లు తోముకుంటుంటే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెంది రుచి పెరుగుతుంది.
 
కానుగ ఆకులు, కాండం బెరడు, కానుగ వేర్లు, వేప చెట్టు బెరడును, జాజికాయలను, తానికాయలను కచ్చాపచ్చాగా దంచి నీళ్లలో వేసి కషాయం తయారుచేసి జలనేతి పాత్రతో గాని లేదా బల్బ్‌సిరంజితోగాని సైనస్‌లని శుభ్రపరిస్తే ఫలితం వుంటుంది. ఇలా కానుక చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.