1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Take curd with jaggery twice a day to reduce runny nose

పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తీసుకుంటే?

curd
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
 
అజీర్తి సమస్యతో బాధపడేవారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 
కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపూటల వారం రోజులు తీసుకుంటే, లేదా గ్లాసు పాలలో పంచదారకి బదులు బెల్లం వేసి రోజు త్రాగినా నెలసరి సమస్యలు ఉండవు.
 
నేయితో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నచోట పట్టు వేస్తే భాధ నివారణ అవుతుంది.
 
ముక్కు కారడంతో బాధపడుతున్న వారికి పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది.
 
బెల్లం, నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే వారం రోజులలో మైగ్రిన్ తలనొప్పి తగ్గుతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకుని తాగితే..?