గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (18:21 IST)

వేసవిలో మహిళలు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే..

వేసవిలో మహిళలు రోగనిరోధక శక్తిని పెంచడానికి చెరకు రసం తాగాలని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే ఆహారంలో నెయ్యి వాడకాన్ని మరిచిపోకూడదు. అలాగే పెరుగు, ఎండుద్రాక్షలను కలిపి తినవచ్చు. ఎందుకంటే ఈ రెండూ కలిసి ప్రోబయోటిక్స్ యొక్క సంపూర్ణ కలయికను ఏర్పరుస్తాయి. 
 
ముఖ్యంగా వంటగదిలో ఇత్తడి, ఇనుప పాత్రలు వాడాలి. ఇనుప కుండలలో వండిన ఆహారం పోషకమైనదని, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
 
గుడ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అనేక యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లతో నిండి ఉంటుంది, బచ్చలికూర ఆహారానికి మంచి అదనపు పోషక ఆహారంగా ఉంటుంది.
 
బచ్చలికూరలో విటమిన్ కె కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌లతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంలో ఆకు కూరగాయలను తప్పనిసరిగా చేర్చాలి. ఇవి రెండూ రోగనిరోధక వ్యవస్థల సంక్రమణ-పోరాట సామర్థ్యాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.