మాస్క్ ధరించలేదని మహిళ జుట్టు పట్టుకున్న పోలీసులు (వీడియో)
madhya pradesh
ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సంయమనం కోల్పోయి ఆమెను ఇష్టానుసారంగా కొట్టారు. జుట్టుపట్టుకుని మరీ ఆమెను పోలీసులు కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో ఆమెను ఇద్దరు పోలీసులు లాక్కెళ్లడం కనిపించింది. పలుసార్లు ఆమెను కిందపడేశారు. ఆమెను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన తల్లితో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని ఆమె కూతురు కూడా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తోసేశారు.
అయితే అసలు ఆమెపై పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి అసలు కారణం ఆమె మాస్క్ ధరించకపోవడమే అని తెలిసింది. మాస్క్ పెట్టుకోకపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే. కానీ అలా చేయనుందుకు ఓ మహిళ పట్ల పోలీసులు మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
सागर में एक महिला की पिटाई का वीडियो वायरल हो रहा है, महिला अपनी बेटी के साथ बाहर निकली थी, मास्क नहीं पहना था बेटी ने भी मुंह पर सिर्फ स्कॉर्फ बांध रखा था। इस बीच पुलिस ने चेकिंग के दौरान गांधी चौक के पास उसे पकड़ लिया @ndtvindia @ndtv @manishndtv @alok_pandey @GargiRawat pic.twitter.com/rKwichtrpd
— Anurag Dwary (@Anurag_Dwary) May 19, 2021
