మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 మే 2021 (13:18 IST)

కరోనాలో పేరెంట్స్‌ను ఆదుకుందామని స్వీట్స్ షాపులో చేరిన యువతి: మత్తు మందిచ్చి అత్యాచారం

గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. కరోనావైరస్ దెబ్బకు తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలుద్దామని స్వీట్స్ దుకాణంలో చేరిన యువతిపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కరోనావైరస్ విజృంభణ కారణంగా కాలేజీ మూసేసారు. దీనితో ఇంటివద్దనే వుంటున్న ఆ యువతి, తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా ఇవ్వాలనుకుని పట్టణంలోని ఓ స్వీట్ షాపులో నెలకి రూ.5వేల జీతానికి పనిలో చేరింది.
 
ఐతే ఆ షాపు యజమాని ఈ యువతిపై కన్నేశాడు. అదనుకోసం చూసిన ఆ కామాంధుడు షాపులో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకును ఇచ్చాడు. అది తాగిన ఆమె కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. దాంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి బయటపడ్డ యువతి తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తించి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు.