బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 మే 2021 (19:36 IST)

గంగానది ఒడ్డున కరోనా వ్యక్తి శవం: కుక్కలు పీకుతుంటే పోలీసులు టైర్లతో కాల్చి అంత్యక్రియలు, సస్పెండ్ అయ్యారు

కరోనా కాలంలో దేశంలో పలుచోట్ల హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనాతో చనిపోతే... ఆ శవాన్ని తీసుకుని వెళ్లేందుకు కుటుంబ సభ్యులు కొందరు భయపడి వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి చూస్తూనే వున్నాం. తిరుపతిలో పదుల సంఖ్యలో అనాధ శవాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంత్యక్రియలు చేస్తున్నారు. కరోనాతో చనిపోయినవారిని అలా అనాధ శవాలుగా వదిలేయకండి అని అభ్యర్థిస్తున్నారు.
 
మన రాష్ట్రంలో ఇలా వుంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరీ ఘోరంగా వుంటోంది. కరోనాతో చనిపోయిన వారిని అంత్యక్రియలు కూడా చేయకుండా గంగానదిలో పడవేస్తున్నారు. దీనితో కుప్పలుతెప్పలుగా శవాలు ఇటీవల ప్రవాహంలో కొట్టుకువచ్చాయి. దీనితో యూపి సర్కార్ అప్రమత్తమైంది. గంగా నది ఒడ్డున, పరిసర ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెట్టారు.
 
గంగా నదిలో శవాలు ప్రవహిస్తుండగా, లెక్కలేనన్ని మృతదేహాలను ఎక్కడో నది ఒడ్డున ఇసుక కింద ఖననం చేశారు. కఠినమైన వైఖరి తీసుకొని ఉత్తరప్రదేశ్ చీఫ్ పర్యవేక్షణ మరియు కఠినత కోసం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ కారణంగా గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని అన్ని ఘాట్ల వద్ద పోలీసులను నిఘా ఉంచారు. అటువంటి పరిస్థితిలో, గంగానది ఒడ్డున కరోనా మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో ఆ శవాన్ని గంగా ఘాట్‌లో సమీపంలో ఆ గుర్తు తెలియని శవాన్ని పెట్రోల్, టైర్లను పోసి కాల్చి అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
 
ఇది యూపీలోని బల్లియా జిల్లాకు చెందినవి. సోమవారం రాత్రి గంగా నదిలోకి ఒక శవం ప్రవహించిన చోట, పోలీసులు టైర్లు, పెట్రోల్ సహాయంతో మృతదేహం అంత్యక్రియలు చేశారు. ఆ మృతదేహం అంత్యక్రియలను పోలీసులు అలా టైర్లతో కాల్చి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనితో బల్లియా ఎస్పీ ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు. ఐతే గంగానది ఒడ్డున కుళ్లిన స్థితిలో వున్న ఆ శవాన్ని కుక్కలు పీక్కుతింటుంటే అప్పటికప్పుడు పోలీసులు చేసిన చర్యను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విభేదిస్తున్నారు.