సంబంధిత వార్తలు
- కుటుంబాలను మింగేస్తున్న కరోనా వైరస్ : చట్టబద్ధమైన దత్తత కోసం..
- దేశంలో మరణ మృదంగం .. ఒకే రోజు 4329 మంది మృత్యువాత
- బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?
- కలియుగ దైవానికి కరోనా తాకిడి: తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- కక్షసాధింపులు తర్వాత.. కరోనా కట్టడిపై దృష్టిసారించండి... సీపీఐ రామకృష్ణ
కోవిడ్ రోగుల్లో నిస్సత్తువ పోవాలంటే...
దేశంలో కోట్లాది మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో లక్షలాది మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న, లేదా చికిత్స ముగించుకుని ఇంటికి చేరుకున్న కరోనా రోగులు ప్రత్యేకంగా ఆహార నియమం పాటించాలని కోరుతున్నారు. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది.
ఆ ఆహార ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. నిద్ర లేచి వెంటనే, నీళ్లలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.
ఉదయాన్నే అల్పాహారంగా రాగి దోశ లేదా పోరిడ్జ్ ఉత్తమమైన అల్పాహారం. మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకునే పదార్థాలతో పాటు నెయ్యి, బెల్లం తినాలి. వీటిని రోటీతో కలిపి కూడా తినవచ్చు.
రాత్రి భోజనంలో కిచిడి తింటే అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. తేలికగా అరగడంతో పాటు మంచి నిద్ర పడుతుంది. ఎక్కువగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగా తాగాలి.
