1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 17 మే 2021 (20:48 IST)

బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?

భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత మూడురోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు లక్ష్మణ్. అయితే ఈ విషయాన్ని బిజెపి నేతలు చాలా గోప్యంగా ఉంచారు. కానీ లక్ష్మణ్ బంధువులే విషయం చెప్పడంతో బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం లక్ష్మణ్‌కు దగ్గు, ఆయాసం ఉండటంతో గత మూడు రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారట. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందట. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిజెపి నేతలు ఒకవైపు చెబుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
 
సీనియర్ బిజెపి నాయకుడు కావడం.. వయస్సు పైబడడం, దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తుందట.