1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (22:42 IST)

జుట్టు రాలిపోతోంది, ఆపేదెలా?

1. ఆలివ్, కొబ్బరి, కనోల నూనెలను కాస్త వేడి చేయండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ వేడి చేయకండి. కాస్త చల్లగ అయ్యాక ఆ నూనెతొ మీ జుట్టుకు మసాజ్ చేయండి. తర్వాత తలస్నానం చేయండి. ఇది ఒక మంచి షాంపు లాగ పని చేస్తుంది.
 
2. రాత్రి మీరు నిద్రపోయేముందు వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం లేదా అల్లం రసంతో మీ జుట్టుకు మర్దన చేయండి. ఉదయం లేచాక తలస్నానం చేయండి.
 
3. కొద్దిగా గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్‌ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు వేచి ఉండాలి. తర్వాత తలస్నానం చేయాలి. లేదంటే ఆలివ్ ఆయిల్‌ను రాత్రిపూట జుట్టుకు రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసినా సరిపోతుంది. తేనె, ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొద్దిసేపయ్యాక తలస్నానం చేసినా చాలు. వారానికి రెండు సార్లు ఈ విధంగా ప్రయత్నిస్తే జుట్టు పెరుగుదలలో ఆశించిన ఫలితాలు వస్తాయి.
 
4. గ్రీన్ టీ జుట్టు రాలడానికి అరికడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల హెయిర్ రూట్స్ కు బలాన్ని అందిస్తుంది. అలాగే కాస్త గోరువెచ్చని గ్రీన్ టీ అంటే వేడి నీళ్లతో ఒక రెండు గ్రీన్ టీ బ్యాగులు వేసి (చక్కెర వేయకండి) తయారు చేసిన మిశ్రమంతో మీ జుట్టుకు మర్దన చేయండి. తర్వాత తలస్నానం చేయండి.
 
5. మెడిటేషన్ ద్వారా జుట్టు రాలడం అరికట్టవచ్చు. మీరు నమ్మిన నమ్మకున్నా ఇది నిజం. మీరు ఎక్కువ ఒత్తిడికి, టెన్షన్ కు గురవ్వడం వల్లే మీ జుట్టు రాలిపోతుంది. అందువల్ల మెడిటేషన్ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారి మీ జుట్టు రాలడం ఆగుతుంది.