ఉల్లితో జుట్టుకు ఎంతో మేలు
ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి. 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి ఉల్లిపాయ రసం పుష్కలంగా 'క్యాటలైజ్' ఎంజైమ్'లను కలిగి ఉంటుంది మరియు దీన్ని చాలా సంవత్సరాలుగా నెరిసిన జుట్టుకు చికిత్సగా వాడుతున్నారు.
సహజసిద్ధంగా తల నెరవటం ఆపటానికి ఉల్లిపాయని తలకి రాయాలి అని మూళికల వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు. ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది.
ఉల్లి రసం ఉపయోగించడం వల్ల చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.
అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వలన మంచి ఫలితము