శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 జులై 2021 (19:33 IST)

ఏపీలో ఆర్థిక పరిస్థితిపై పీఏసీ చైర్మన్‌ పయ్యావుల సంచలన ఆరోపణలు

ఏపీలో ఆర్థిక పరిస్థితిపై పీఏసీ చైర్మన్‌ పయ్యావుల సంచలన ఆరోపణలు చేశారు. రెండేళ్లలో ఆర్థికశాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నర్ హరిచందన్‌కు  పయ్యావుల ఫిర్యాదు చేశారు.

40 వేల కోట్ల ఆర్థిక లావాదేవీల్లో అకౌంటింగ్ ప్రొసీజర్స్‌లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల తెలిపారు. రెండేళ్లకు సంబంధించిన ఆర్థికశాఖ రికార్డులను.. స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని గవర్నర్‌ను కోరారు.

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి రాసిన లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా.. ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.