1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (08:46 IST)

అరాచక ఆంధ్రప్రదేశ్‌: అచ్చెన్నాయుడు

నవ్యాంధ్రప్రదేశ్‌ను సిఎం జగన్‌ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారని ఆరోపించారు.

రెండేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలే గాని ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్‌ భర్తపై వైసిపి నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్‌ తెరిచి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి బిసి నేతలే లక్ష్యంగా వైసిపి ఎంపి విజయసాయి, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.

టిడిపి జారీ చేసిన పది డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు సిఎం జగన్‌ పంగనామం పెడుతున్నారని, డీజిల్‌ ధరలు పెంపుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.