రాష్ట్రంలో క్షేత్రస్థాయి కొవిడ్ పరిస్థితుల ఆరాకు ప్రత్యేక బృందం..
రాష్ట్రంలో క్షేత్రస్థాయి కొవిడ్ పరిస్థితుల ఆరాకు ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు నౌకాయాన బృందం.
కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అత్యవసర ప్రాణవాయువు అవసరత, ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. రూపొందించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు సమాచారం.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లింది. రానున్న రెండ్రోజుల్లో తొలుత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.