బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (21:47 IST)

రాష్ట్రానికి కొత్తగా మరో 3 ఐఎస్‌వో ట్యాంకులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు

అమరావతి: రాష్ట్రానికి కొత్తగా మరో 3 ఐఎస్‌వో ట్యాంకులు రానున్నట్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అందించనునట్లు చెప్పారు. జామ్‌నగర్‌ నుంచి 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌‌ రాష్ట్రానికి చేరుకుంటుందని తెలిపారు.

ఆదివారం నాటికి 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు కృష్ణపట్నం చేరుతుందని వెల్లడించారు. ఒక్కో ట్యాంకులో 20 టన్నుల, 40 టన్నుల ఆక్సిజన్‌ ఉందని, ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రేపు ట్యాంకులు కృష్ణపట్నం వస్తాయిని కృష్ణబాబు తెలిపారు. కాగా.. ఇప్పటికే దుర్గాపూర్ పరిశ్రమలోని 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్‌ నింపినట్లు ఆయన వెల్లడించారు.