ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (22:28 IST)

మహిళలు సోయా మిల్క్ తప్పనిసరిగా తాగాలట!

Soya Milk
మహిళలు సోయా మిల్క్ తప్పనిసరిగా తాగాలట.. ఎందుకంటే.. మహిళల్లో ఏర్పడే ఎముకల సమస్యకు ఇది చెక్ పెడుతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఎముకలకు కూడా సోయా పాలు చాలా ఆరోగ్యకరం. 
 
సోయాలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా చేస్తుంది. సోయా పాలలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. 
 
ప్రొటీన్ ఎక్కువగా ఉండే శాకాహారం కోసం చూస్తుంటే సోయా మిల్క్ పర్ఫెక్ట్. రెగ్యులర్‌గా దీనిని తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రోటీన్స్ అందుతాయి. అలానే సొయా పాలల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హెల్దీ ఫ్యాట్స్. దీని వల్ల అల్జీమర్ లాంటి బ్రెయిన్ సమస్యలు కూడా తగ్గుతాయి. 
 
హృదయ ఆరోగ్యానికి కూడా సోయా మిల్క్ చాలా ఉపయోగకరం. దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా ఇది కొలెస్ట్రాల్‌ని పెంచదు. బీపీని నియంత్రిస్తుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.