గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (22:31 IST)

బరువు తగ్గాలంటే.. ఐస్ ముక్కలను ఇలా వాడాలట!

ఐస్ ముక్కలను ఇలా వాడితే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. ఐస్ ముక్కలతో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం తాజాగా వుంటుంది. బరువు ఎక్కువగా ఉన్న, చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌‌ను ఉంచి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోయతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. 
 
కొందరికి కళ్ళ కింద నిద్ర ఎక్కువ అయిపోయినా కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపుతో చెక్కగా ఉంటుంది.
 
ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందర కనుబొమ్మలు ఐస్ ముక్కతో రుద్దితే నొప్పి అనిపించదు. 
 
ముఖంపై మొటిమల వ‌ల్ల నొప్పితో చిరాకు పెడుతుంది. అప్పుడు ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి పెడుతున్న భాగంలో అద్దాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.