నిమ్మకాయ ఊరగాయలో ఓ అన్నం ముద్ద.. మహిళలు తీసుకుంటే..?
నిమ్మకాయ ఊరగాయలో ఓ అన్నం ముద్ద తీసుకుంటే ఆరోగ్యానికే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం. నిమ్మకాయ తొక్కు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైములు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహకరిస్తాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.
నిమ్మకాయలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి కాల్షియం, విటమిన్ ఏ, సీ, పొటాషియం కలిగిన నిమ్మకాయను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోవడానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ ఒకటి. ఇందులో బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
నిమ్మకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొవ్వు అసలు ఉండదు. హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చు తగ్గులు రక్తపోటుకు కారణమవుతుంది. అయితే రోజూ నిమ్మకాయతో తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.