శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి

జీలకర్ర నీటిలో వేగంగా బరువు తగ్గుతారు తెలుసా?

Jeera water
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే జీలకర్ర నీటిని సేవించడం మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బరువు తగ్గడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. దీనివల్ల అధిక కొవ్వు కరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా తరిమికొడుతుంది.

కాబట్టి వేగంగా బరువు తగ్గడానికి మీరు మూడు నుంచి నాలుగు సార్లు రోజుకి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మరొకసారి, రాత్రి భోజనం అయ్యాక ఒకసారి, నిద్రపోయే ముందు ఒకసారి ఇలా తీసుకోవచ్చు.
 
మామూలుగా జీలకర్రలో నీళ్ళు వేసుకొని తాగడం వల్ల కొన్ని కొన్ని సార్లు మీకు ఆ రుచి నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు దానిలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకుని తీసుకోవచ్చు. పైగా దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
 
ఒక రాత్రి అంతా జీలకర్రని నానపెట్టేసి ఉదయాన్నే తాగే ముందు దాల్చిన చెక్క పొడి లేదా అల్లం పొడి వేసుకోవచ్చు. కొద్దిగా తేనె వేసుకుని తియ్యగా తీసుకోవచ్చు. అలానే నిమ్మరసం కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.
 
ఇంకా మెంతులు, జీలకర్ర కలిపి తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా నీళ్లను మరిగించి వాటిలో మెంతులు, జీలకర్ర వేసి మరిగించి తర్వాత వడకట్టి ఆ నీళ్లు తాగడం మంచిది. ఇలా ఈ పద్ధతుల్లో ఏదైనా అనుసరించవచ్చు. వీటివల్ల నిజంగా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.