గురువారం, 7 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:33 IST)

Fat బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేస్తే...

కొందరు కూర్చున్నచోట నుంచి కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయులుగా మారిపోతారు. విపరీతమైన శరీరం వచ్చేస్తుంటుంది. పైగా వ్యాయామం కూడ చేయకపోవడం మూలంగా కొవ్వు చేరిపోతుంది. అలాంటివారు మళ్లీ తిరిగి తమ చక్కని ఆకృతి కోసం వ్యాయామాలు చేస్తుంటారు. దీనితో పాటు ఇపుడు చెప్పుకోబోయే చిట్కాలు కూడా పాటిస్తే బరువును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.
 
మన వంటింట్లో వుండే వాములో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవుగా ఉంటాయి. వాములో ఉండే తైమల్ అనే రసాయనం బ్యాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, అలసటకి వాము ఔషధంగా పనిచేస్తుంది.
 
వాము ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటం వలన అజీర్తి సమస్యలు, మలబద్దకం తగ్గుతాయి. వాము నుంచి తీసిన నూనెను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు రాసుకోవటం వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది. వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకోవడం వలన జలుబు, కఫం నుంచి  ఉపశమనం పొందవచ్చు.
 
ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగటం వలన శరీర బరువు తగ్గుతుంది. ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రకరకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.