శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (15:16 IST)

తేయాకు తోటలో కింగ్ కోబ్రా... 20 కేజీల బరువు.. 16 అడుగుల పొడవు

Snake
అసోంలో ఓ భారీ కాల‌నాగు (కింగ్ కోబ్రా) క‌ల‌క‌లం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోట‌లో 16 అడుగుల‌ పొడ‌వున్న భారీ న‌ల్ల‌త్రాచును చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే స్నేక్ సొసైటీ వారికి స‌మాచారం ఇవ్వ‌గా వారు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని ఆ కింగ్ కోబ్రాను గోనె సంచిలో బంధించారు.
 
అనంత‌రం దాన్ని స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు. గోనెసంచిలో బంధించిన అనంత‌రం ఆ పామును తూకం వేయ‌గా 20 కిలోల బ‌రువు తూగ‌డం గ‌మ‌నార్హం. రాజ నాగాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు నానా తంటాలు పడ్డారు.