శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (16:37 IST)

కిమ్ జాంగ్ ఉన్ సన్నబడ్డారా? కారణం ఏమిటి? ఫోటో వైరల్

Kim Jong Un
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సన్నబడ్డాడనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా విడుదలైన ఫోటోనే కారణం. ఈ ఫోటోలో ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. బరువు మునుపటి కంటే చాలా తక్కువకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతేగాకుండా అతని ఎడమ మణికట్టు మునుపటి కంటే సన్నగా కనిపిస్తుంది. ఈ ఫొటోలో అతడికి ఇష్టమైన గడియారం అతడి మణికట్టుకు ఉంది. దీని ఖరీదు దాదాపు 12 వేల డాలర్లు. 
 
నిపుణులు ఈ ఫొటోను 2020 నవంబర్-ఈ ఏడాది మార్చిలో తీసిన ఫొటోతో జత చేసి పరీక్షించారు. 37 ఏండ్ల కిమ్‌కు ఏకరీతిగా ధూమపానం చేయడం అలవాటు. అతని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 2011 లో గుండెపోటుతో మరణించారు. జీవనశైలి, బరువు కారణంగా కిమ్‌ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు.
 
కిమ్ బరువు 140 కిలోలు అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉటంకిస్తూ ఎన్‌కే న్యూస్ పేర్కొంది. ఇదే సమయంలో 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతని బరువు దాదాపు 7 కిలోలు పెరిగింది. అయితే, తాజా ఫొటోలో సన్నగా కనిపిస్తున్న కిమ్ ఏదో ఒక వ్యాధి కారణంగా అలా కనిపిస్తున్నాడా? లేదా బరువు తగ్గడం పట్ల నిజంగానే శ్రద్ధ కనబరిచారా? అనే అనుమానం తలెత్తింది.