తాతకు 37వ పెళ్లి.. 28 మంది భార్యలు 35 మంది సంతానం.. ఎక్కడ..?
ఓ తాత తన 28 మంది భార్యల ముందు 37వ వివాహం చేసుకున్నాడు. చెప్పడానికి వింతగా ఉన్న ఇది నిజం. పెళ్ళికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
28 మంది భార్యలు, 35 మంది సంతానం.. ఏకంగా 126 మంది మనవలు, మనవరాళ్ల ముందు పెళ్లి చేసుకుంటున్నాడు అని రాసుకొచ్చాడు. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పెళ్లి సమయంలో అతడి భార్యలు డాన్స్ చేస్తుండటం నెటిజన్లను ఆకర్షించింది.
ఈ పెళ్లి వీడియో చూసిన నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేశారు. ఒక్క పెళ్లి చేసుకుందామంటేనే పిల్ల దొరకడం లేదు అంతమంది నీకు ఎలా దొరికారాని కొందరు అంటే.. భార్యలతో ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు.
ఒక్కసారి కూడా పెళ్లి కాకుంటే ఆయన 37వ భార్యను కట్టుకోవడం సూపరని మరో యూజర్ కామెంట్ చేశాడు. ప్రస్తుత ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా ఈ పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనేది తెలియరాలేదు.