మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (16:17 IST)

‘కథ కంచికి మనం ఇంటికి’ అంటోన్న ఆదిత్ అరుణ్‌

Adit Arun
అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం క‌థ కంచికి మ‌నం ఇంటికి. ఈ చిత్రం టైటిల్ ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర‌నుండి సినిమా ల‌వ‌ర్స్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్గ్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. పక్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరాలియో సంగీతం అందించిన ఆడియొ అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్ట‌కునేలా ట్యూన్స్ ఇచ్చారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.
 
నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ, అద్బుత‌మైన టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. పూర్తి వైవిధ్యంగా ఈ క‌థ ని ద‌ర్శ‌కుడు చాణిక్య మాకు చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ప్పుడే టైటిల్ ని అనుకున్నాం. మాకు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తెర‌కెక్కించాడు. అరుణ్ ఫెర్‌ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్ర‌తి సినిమాకి ఒదిగివుండి క‌థలో పాత్రలో ఒదిగిపోతాడు. ఈ సినిమాతో మా ఫ్యామిలి మెంబ‌ర్ అయ్యిపోయాడు. క్లైమాక్స్ లో అదిత్ న‌ట‌నకి ప్రేక్ష‌కులు ధియోట‌ర్ లో ఊగిపోతారని అన్నారు.
 
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబత్తిన,  లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట, మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో, కెమెరాః వైయస్ కృష్ణ, ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడిచ డైలాగ్స్ శ్రీనివాస్ తేజ, ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్