గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (22:01 IST)

దుమ్మురేపుతున్న స‌న్నీలియోన్ ఐటం సాంగ్‌ (video)

Shinde, sunny, rohit
స‌న్నీలియోన్ ప్రొఫెష‌న‌ల్ డాన్స‌ర్ కూడా. ఆమెతో డాన్స్ చేయ‌డానికి జంకాన‌ని క‌థానాయ‌కుడు రోహిత్ చౌద‌రి తెలియ‌జేస్తున్నాడు. ఆమెతో క‌లిసి మ‌రాఠీ సినిమా అంధానివాస్‌లో శాంతాభాయ్‌గా న‌టించిన స‌న్నీతో ఐటెం సాగ్‌ను చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు. ఆ డాన్స్ కు బాగా స్పంద‌న వ‌చ్చింది. ఈ నృత్యంలో రోహిత్ చౌద‌రి, షిండే కూడా స‌న్నీతో జ‌త క‌లిపారు. ఇందులో రోహిత్ రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ మేన్‌గా క‌నిపిస్తే, షిండే రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. స‌న్నీ చేసిన గీతం చిత్రానికి హైలైట్ అవుతుందంటున్నాడు చౌద‌రి.
 
బాలీవుడ్ టౌన్‌లో ఆయ‌న ఈ సినిమా గురించి మాట్లాడుతూ, కోవిడ్ ఆంక్ష‌ల త‌ర్వాత ప్ర‌భుత్వ స‌డ‌లింపు ఇచ్చాక ఇటీవ‌లే చేసిన డాన్స్ ఇది. షిండే న‌ట‌న‌లో స‌ముద్రం అయితే నేను ఓ బొట్టును. ఇక డాన్స్‌లో ప్రొఫెస‌న‌ల్ స‌న్నీ. ఆమెతో డాన్స్ చేయ‌డ‌మంటే కొంచెం భ‌య‌ప‌డ్డాను. నా ప‌రిస్థితి గ్ర‌హించి ఎంక‌రేజ్ చేసింది. దాని ఫ‌లిత‌మే అద్భుతంగా వ‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశాడు. నిర్మాత నుంచి హీరోగా  ఈ సినిమాతో మారాడు రోహిత్ చౌద‌రి.
 
ఇక స‌న్నీలియోన్ మంచు మ‌నోజ్ సినిమా `క‌రెంట్‌తీగ‌`లో డాన్స్‌నెంబ‌ర్ ప్లే చేసింది. క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్‌తోనూ అల‌రించింది. త్వ‌ర‌లో ఓ భారీ తెలుగు సినిమాలో అల‌రించ‌నుంది.