శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 13 మే 2021 (18:40 IST)

దేవుడు అందరినీ చల్లగా చూడాలంటున్న సన్నీలియోన్‌

sunnyleone family
దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి! అంటూ నీలి చిత్రాల సుంద‌రి స‌న్నీలిన్ కోరుకుంటోంది. ఆమెలో మాన‌వ‌త్వం, ద‌యాద్ర‌త కోణం కూడా వుంది సుమా. సన్నీలియోన్‌ పుట్టిన‌రోజు ఈరోజే. మే 13. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. అందుకే థ్యాంక్ యూ అంటూ అంద‌రికీ పోస్ట్ చేసింది. నా పుట్టిన‌రోజున మీ అద్భుతమైన శుభాకాంక్షల తెలిపిన‌ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా కోరిక ఏమిటంటే, సురక్షితంగా ఉండండి, మాస్క్ ధ‌రించ‌డి, భౌతిక‌దూరం పాటించండి.. అంటూ లోగోను కూడా పోస్ట్ చేసింది. 
 
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీలియోన్‌ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లీన్‌. ఆమె చిన్న‌త‌నం నుంచి మొహంమీదే ఏదైనా మాట అనేస్తుంది. కెన‌డాలో పుట్టినా భార‌తీయ మూలాలు వున్నాయి. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. 
 
Thank you
కరెన్ జిత్ పేరును 'సన్నీ'గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిముద్దు రుచి చూశానని చెప్పిన సన్నీ లియోన్ 16వ ఏట ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ తో తొలిసారి శారీరక సుఖం అనుభవించానని చెబుతుంది. తనలో స్వలింగసంపర్క అభిలాష కూడా ఉందని అంగీకరించింది. వైద్యవృత్తిలో రాణించాలని నర్స్ కోర్సు చదివింది. కానీ, తన 19వ యేట పోర్న్ మూవీస్ లో నటించడానికి సిద్ధమయింది. అప్పటి నుంచీ పలు నీలి చిత్రాలలో సన్నీ లియోన్ అందచందాలతో ఆకట్టుకుంది. ఇందుకు ప్ర‌తిసారీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవార‌నీ, అంతా ఫ‌ర్‌ఫెక్ట్ అన్నాకే నీలి చిత్రాల్లో న‌టించేదానిని బాహాటంగానే సెల‌విచ్చింది.
 
ప్రస్తుతం భర్త డేనియెల్ వెబర్, తన ముగ్గురు పిల్లలతో కలసి లాస్ ఏంజెలెస్ లో ఉంది. అమెరికన్ కేన్సర్ సొసైటీకి నిధులు సేకరించడంలోనూ, జంతుసంరక్షణలోనూ సన్నీ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. త్వరలోనే ముంబయ్ కి వస్తానంటోంది సన్నీ. మరి రాబోయే చిత్రాలలో సన్నీ ఏ రీతిన తన అభినయంతో ఆకట్టుకుంటుందో చూడాలి.
 
తెలుగులోనూ న‌టించిందింది
తెలుగులో మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'కరెంట్ తీగ'లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'పీఎస్వీ గరుడవేగ'లో "డియో డియో" సాంగ్ లో కనువిందు చేసింది.ప్ర‌స్తుతం  'వీరమదేవి' అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. అయితే అది ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌. కానీ ఆ పాత్ర‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.