1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. more festival days in march month

తిరుమలలో మార్చి నెలలో విశేష పర్వదినాలు..21న ఉగాది ఆస్థానం, 29న శ్రీరాములవారి పట్టాభిషేకం

march month
తిరుమలలో శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో విశేష పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 1 వ తేది నుంచి 5 వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, 5 వ తేదిన కుమారధార తీర్థముక్కోటి, 7న శ్రీ లక్ష్మి జయంతి, 17న అన్నమాచార్య వర్దంతి, 21 ఉగాది పర్వదినాలు ఉన్నాయి. 
 
ఉగాది సందర్భంగా శ్రీవారి ఆస్థానం అదేరోజు నుంచి తిరుమల శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం, 22 న మత్స్యజయంతి, 28 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి ఆస్థానం, 29 న శ్రీ రాముల వారి పట్టాభిషేక ఆస్థానం లాంటి పండుగలను టిటిడి శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొత్తంపై మార్చి నెలలో మరిన్న ధార్మిక కార్యక్రమాలతో తిరుమల మార్మోగనున్నది. 
About Writer
pyr