భార్య ప్రైవేట్ ఫోటోలను.. సోదరుడికి షేర్ చేశాడు..

Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:28 IST)
మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ప్రైవేట్ ఫోటోలను ఓ దుర్మార్గపు భర్త తన సోదరుడికి పంపిన ఘటన కువైట్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అబుదాబిలో నివసిస్తున్న భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాన్ని సాగించారు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు భార్య తన భర్త ఫోన్ చూసింది. అందులో ఆమె ప్రైవేట్ ఫోటోలు వుండటాన్ని చూసి షాక్ అయ్యింది. 
 
అంతేగాకుండా షాక్‌లపై షాక్‌లు ఆమె తగిలాయి. తన ప్రైవేట్ ఫోటోలను ఆ దుర్మార్గపు భర్త ఆతడి సోదరికి ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశాడు. దీంతో షాకైన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య ఫోటోలను సోదరుడికి పంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత చదవండి :