శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:08 IST)

వధువు మెడలో మూడుముళ్లు వేసి.. బాత్రూమ్‌లో మరో అమ్మాయితో ముద్దులు...

పెళ్లి పందిరిలో వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆ తర్వాత మూత్ర విసర్జన కోసం బాత్రూమ్‌కు వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ అమ్మాయి(పనిపిల్ల)తో వరుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాత్రూమ్‌లో శృంగారం చేసేందుకు సమ్మతించాలంటూ బలవంతం చేశాడు. ఆమెను గట్టిగా తన కౌగిలిలో బంధించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కేకలు వేయడంతో పెళ్లి కొడుకు బండారం బయటపడింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని నార్తాంప్టన్ నగరంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నగరానికి చెందిన మ్యాథ్యూ ఐమర్స్ అనే 28 యేళ్ళ యువకుడు ఓ యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడలో మూడు ముళ్లు వేసిన తర్వాత బాత్రూమ్‌కు వెళ్లాడు. బాత్రూమ్ వద్ద ఓ టీనేజ్ అమ్మాయి కనిపించడంతో మనోడికి ఆమెపై కన్నుపడింది. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె దగ్గరికి వెళ్లి 'సెక్స్ చేసేందుకు వస్తావా' అంటూ ప్రతిపాదన చేశాడు. 
 
అయితే, తనతో మాట్లాడుతున్నది పెళ్లికొడుకు అనే విషయం గ్రహించిన ఆ అమ్మాయి... అతని మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. అయినా ఆమెను వెంబడిస్తూ వెనకే వెళ్లాడు. బాత్రూమ్‌లోకి వెళితే రాలేడనుకున్న ఆ వెయిట్రస్... వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే బాత్రూమ్‌లోకి కూడా దూరిన అతను... బలవంతంగా ముద్దుల పెట్టాడు. బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని... బయటికి వచ్చిన ఆమె అందరికీ విషయం చెప్పింది. దీంతో వరుడి అసలు స్వరూపం తెలిసిన వధువు... అతనితో పెళ్లిని రద్దు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని అరెస్టు చేశారు.