1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. After coronavirus, China detects new virus that can damage brain

కరోనా తర్వాత కొత్త రోగం.. భయపెడుతున్న చైనా.. రక్తాన్ని పీల్చేస్తాయట!

corona
కరోనా తర్వాత కొత్త రోగంతో చైనా భయపెడుతోంది. చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. 
 
గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ కనుగొనబడింది. 
 
ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు.
తర్వాతి కథనం
ఆమె శృంగార బానిసగా వాడుకుంది.. దావా వేసిన బాధితుడు