సంబంధిత వార్తలు
- గూగుల్ మొబైల్ సర్వీసులు లేని ''ఆనర్ వి6'' ట్యాబ్లెట్ విడుదల
- చైనాలో 5జీ సేవలు ప్రారంభం.. అది ఎక్కడో తెలుసా?
- ఫ్లిఫ్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌పై కట్నం కేసు.. భార్యను వేధించాడట..
- అందమైన భామలతో ఎర.. హనీ ట్రాప్.. ముగ్గురు నేవీ ఉద్యోగుల అరెస్ట్
- 100 రోజుల్లో భారత్‌లో 5జీ టెక్నాలజీపై పరిశీలన.. Huawei రెడీ
హువావేపై అమెరికా ఆంక్షలు... 5జీ నెట్‌వర్క్‌తో భద్రతను ప్రమాదంలో
5G network
తాజాగా జాతీయ భద్రత, 5జీ నెట్‌వర్క్ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయనుంది.
అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తాము సహించబోమని హెచ్చరించింది.
అమెరికాలో హువావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని.. ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. దీంతోపాటు అమెరికా ఆంక్షలు విధించింది.
ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను హువావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోయిందని.. తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హువావే కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.
ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసే వస్తువులను హువావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.
