బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (12:21 IST)

ఫ్లిఫ్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌పై కట్నం కేసు.. భార్యను వేధించాడట..

Sachin Bansal
ఫ్లిఫ్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌పై కట్నం కేసు నమోదైంది. వరకట్నం కోసం సచిన్ సన్సల్ వేధిస్తున్నాడని ఆయన భార్య ప్రియ బన్సల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కోసం బన్సల్ శారీరకంగా వేధించాడని.. డబ్బు తేవాల్సిందిగా డిమాండ్ చేశాడని పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు పోలీసులు సచిన్ బన్సల్, ఆయన తండ్రి సత్ప్రకాష్ అగర్వాల్, తల్లి కిరణ్ బన్సల్, సోదరుడు నితిన్ బన్సల్‌పై కొరమంగళ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్‌ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్యానల్ కోడ్- 498ఎ, 34ల కింద ఈ కేసులు నమోదైనాయి. 
 
ప్రియ బన్సల్ తన ఫిర్యాదులో తమ పెళ్లికి ముందే వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. తన తండ్రి పెళ్లికి రూ .50 లక్షలు ఖర్చు చేశారని, సచిన్‌కు రూ .11 లక్షల నగదు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు మీద ఉన్న ఆస్తులను తనకు బదిలీ చేయమని తన భర్త తనపై ఒత్తిడి తెస్తున్నాడని, అలా చేయడానికి ఆమె నిరాకరించడంతో, ఆమె తన అత్తమామలచే వేధింపులకు గురైందని కూడా ఆమె ఆరోపించారు.
 
ఈ క్రమంలో సచిన్ బన్సల్ తనపై శారీరకంగా దాడి చేశాడని, డబ్బు డిమాండ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, వారు కలిగి ఉన్న ఆస్తులను కలిపి తనకు సంతకం చేయమని డిమాండ్ చేసిన తరువాత అతను ఆమెపై శారీరకంగా దాడి చేశాడని ఆరోపించారు.

2018లో వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తరువాత సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన ఓలాలో100 మిలియన్లతో సహా స్టార్టప్‌లలో అనేక పెట్టుబడులు పెట్టాడు.