సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (13:17 IST)

ఇక ఆన్‌లైన్‌లో భారత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం.. ఫ్లిఫ్ కార్ట్

ఆన్‌లైన్ వ్యాపారంలో అదరగొడుతున్న ఫ్లిఫ్ కార్ట్ సంస్థ భారతీయ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టనుంది. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఫ్లిఫ్‌కార్ట్ సిద్ధమవుతోంది. భారతీయ ఆన్‌లైన్ షాపింగ్‌లో అగ్రగామి అయిన ఫ్లిఫ్ కార్ట్.. అమెరికాకు చెందిన వాల్ మార్ట్ సంస్థకు బ్రాంచ్‌గా పనిచేస్తోంది. 
 
భారత్‌లో ఫెస్టివల్ ఆఫర్ పేరిట భారీ ఆఫర్లు ఇచ్చి.. కోట్లలో వ్యాపారం చేస్తున్న ఫ్లిఫ్ కార్ట్ తన ఆన్‌లైన్ వ్యాపారంలో తదుపరి విడతగా వ్యవసాయ ఉత్పత్తులను చేస్తోంది. దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఆహార పదార్థాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించనుంది. ఇందుకోసం నింజాకార్టులో వాల్ మార్ట్ పెట్టుబడి పెట్టింది.
 
అయితే ఈ షేర్ విలువ ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఫ్లిఫ్ కార్టుకు 77 షేర్లతో కొనుగోలు చేసిన వాల్‌మార్ట్.. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం నింజాకార్టులో పెట్టుబడి పెట్టింది.