జియోమి పోకో ఎఫ్-1 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గిందోచ్..

Last Updated: శుక్రవారం, 7 జూన్ 2019 (18:54 IST)
జియోమికి చెందిన బ్రాండ్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌పై ధరను తగ్గించినట్లు ప్రకటించింది. అవును.. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన పోకో ఎఫ్-1 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించడం జరిగింది. దీని ధర రూ.20,999 నుంచి రూ.19,999 వరకు పలికింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై రెండు వేల రూపాయలను తగ్గిస్తున్నట్లు జియోమీ ప్రకటించింది. 
 
ఈ తగ్గిన ధరతో పోకో ఎఫ్-1 రూ.17,999లకే వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. జూన్ 9వ తేదీ వరకే ఈ తగ్గింపు ధరలో పోకో ఎఫ్-1 ఫోన్లు అందుబాటులో వుంటాయి. అలాగే 6జీబీ రామ్ 128 జీబీ మెమరీ వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు ధర వర్తిస్తుందని జియోమీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, ఎమ్ఐడాట్‌కామ్‌లలో పొందవచ్చు.
 
పోకో ఎఫ్-1 ఫీచర్స్
6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
2246 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
6/8 జీబీ ర్యామ్ 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 
12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 
20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్దీనిపై మరింత చదవండి :