శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (16:31 IST)

ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌ ధరను తగ్గించింది. ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ భారత్‌ మార్కెట్లోకి నాలుగు నెలల క్రితం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా రూ.16,990గా వున్న ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల వరకు తగ్గించింది. ఫలితంగా రూ.14,990 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందని ఒప్పో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
తగ్గించిన ధరతో కూడిన ఈ ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్ట్రల్ బ్లూ, పియానో పింక్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో వుంటుందని ఒప్పో తెలిపింది.