ఫ్లిఫ్ కార్ట్ నుంచి మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌

Last Updated: సోమవారం, 26 ఆగస్టు 2019 (14:33 IST)
మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఈ నెల 31వ తేదీతో ఈ సేల్ ముగియనుంది. ఈ సేల్ ద్వారా వినియోగదారులు అనేక ఫోన్లను చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు. గెలాక్సీ ఎస్10 ఫోన్లకు గాను రూ.5వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 3ఎపై రూ.3వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.

వీటితో పాటు హానర్ 8సి, రియల్‌మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ50, వివో జడ్1 ప్రొ, షియోమీ రెడ్‌మీ 6, ఒప్పో ఎ5, మోటోరోలా వన్ విజన్, అసుస్ 5జడ్, హానర్ 10 లైట్, హానర్ ప్లే ఫోన్లను ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు అందించనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

హానర్ 10 లైట్ రూ.8,999లకే లభించనుంది. దీని అసలు ధర రూ.13,999. అలాగే హానర్ ప్లేను భారీ డిస్కౌంట్ కింద అందించనున్నారు. రూ.21,999 పలికే హానర్ ప్లే రూ.11,999లకే లభించనుందని ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.దీనిపై మరింత చదవండి :