గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: గురువారం, 2 మే 2019 (20:11 IST)

అదిరిపోయే ఆఫర్... ల్యాప్‌టాప్ కేవలం రూ. 13,990కే... రేపే ఆఖరు..

సమ్మర్ సీజన్ వస్తే చాలు ఆయా కంపెనీలు విపరీతంగా డిస్కౌంట్లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వుంటాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించేసింది. దీనితో ఇపుడంతా వినియోగదారులు ఆ ఆఫర్లలో వస్తువులను బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. 
 
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన కొన్ని భారీ ఆఫర్లను చూద్దాం...  హెడ్‌ఫోన్స్ అండ్ స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే పవర్ బ్యాంక్స్‌ రూ.500 ప్రారంభ ధరతో దక్కించుకోవచ్చు. కెమెరాల ధర రూ.3,499 నుంచి ప్రారంభమయితే ల్యాప్‌టాప్స్ కేవలం రూ.13,990కే ఇస్తామని తెలిపింది. ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 7,500 వరకూ తగ్గింపు కూడా వుంది. ఇంకా ఎన్నో వస్తువులను డిస్కౌంట్ కింద అందుబాటులో వుంచింది. ఐతే ఇవన్నీ కేవలం రేపటి వరకు మాత్రమే అందుబాటులో వుంటాయి.