శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:03 IST)

రిలయన్స్ జియో న్యూ ఆఫర్.. రోజుకు 25జీబీ డేటా.. 3 నెలలకు ఉచితం?

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆకట్టుకునే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో ఇతక నెట్‌వర్క్ సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ రోజుకు 25జీబీ డేటాను మూడు నెలలకు ఉచితంగా అందజేయనున్నట్లు జియో బంపర్ ఆఫర్ పేరిట ఓ ప్రకటన వచ్చింది. 
 
ఈ ఆఫర్‌లో రోజుకు 25 జీబీ డేటా మూడు నెలలకు ఉచితంగా డేటాను వాడుకునే సౌలభ్యం వుంటుంది. జూన్ నెల వరకు ఉచిత డేటా పేరిట ఈ ఆఫర్ గురించి ప్రకటన వచ్చింది. ఈ వార్త రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై జియో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని.. జియో అలాంటి ప్రకటనను విడుదల చేయలేదని టాక్ వస్తోంది.