బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (10:49 IST)

ఏటీఎం కార్డులు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే?

ఏటీఎం కార్డులు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చునని ఎస్‌బీఐ వెల్లడించింది. యోనో క్యాష్‌ పాయింట్‌లను ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ యోనోపై కొత్తగా యోనో క్యాష్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశ వ్యాప్తంగా 16,500కి పైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు. 
 
యోనో క్యాష్ పాయింట్‌గా పిలువబడే ఈ పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్ డ్రాను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేయాలి. తర్వాత ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నెంబరును ఎంట్ చేయడం ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ పని 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి వుంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది. 
 
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.