బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:20 IST)

ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్... ఓన్లీ ఫర్ ఉమెన్స్...

భారతదేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ... ప్రత్యేకించి మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించి.. ఉద్యోగాలు చేస్తున్న నారీమణుల కోసం ‘ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌’ పేరిట కొన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
ఈ అకౌంట్ ప్రారంభించిన వారికి... షాపర్స్‌స్టాప్ గిఫ్ట్ కార్డ్‌తోపాటు... తనిష్క్, ఓలా నుండి వోచర్లు కూడా అందజేయబడతాయి. వీటితోపాటు బిగ్ బాస్కెట్, లాకర్ రెంటల్స్ కొనుగోళ్లలో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ అన్నింటితోపాటు ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగంపై క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది. 
 
ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ప్రత్యేకతలు.. 
* ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగం వల్ల రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందడంతోపాటు ఈ కార్డుని అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ ఎన్ని సార్లయినా ఉపయోగించవచ్చు. 
* ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో లాకర్ రెంటల్స్‌పై 50 శాతం తగ్గింపు పొందవచ్చు.
* రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ లభిస్తుంది. వారికి వడ్డీ రేట్లు ప్రత్యేకంగా ఉంటాయి. హోమ్ లోన్, హోమ్ లోన్ టాప్-అప్ తీసుకున్నవారికి ప్రాసెసింగ్ * ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది.
* హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. 
* టూవీలర్ లోన్‌లపై ప్రాసెసింగ్ ఫీజులో రూ.499 తగ్గింపు, వాహనానికి 100 శాతం ఆన్-రోడ్ ప్రైస్ రుణంగా పొందొచ్చు. 
* షాపర్స్‌స్టాప్ నుండి రూ.2,000 గిఫ్ట్ వోచర్.
* మూడు నెలలకు ఒకసారి ఎయిర్‌పోర్ట్ లాంజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్.
* రూ.250 విలువైన ఓలా వోచర్.
* బిగ్‌బాస్కెట్‌లో నెలకు ఒకసారి రూ.1,000 కొనుగోలుపై రూ.250 డిస్కౌంట్.
* సిప్, పీపీఎఫ్ ఆటో డెబిట్ కలిగి ఉంటే తనిష్క్ నుంచి రూ.1,500 విలువైన వోచర్.
* డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ రూపంలో రోజుకు రూ.2 లక్షల వరకు చెల్లింపులపై చార్జీల మినహాయింపు.
* ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్, తొలి ఏడాది డీమాట్ ఏఎంసీ ఫీజులు ఉండవు.