రియల్‌మి 3 మొబైల్ రిలీజ్... జియోతో బంపర్ ఆఫర్...
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రియల్‌మి 3 పేరుతో ఆ మోడల్ అందుబాటులోకి వచ్చింది. గత మోడల్ రియల్‌మి 2 కంటే అన్ని విధాలుగా సరికొత్తగా ఉండబోతోంది. ఇది 3డీ గ్రేడియంట్ యూని బాడీ డిజైన్, వాటర్ డ్రాప్ నాచ్, హీలియో పీ70 ప్రాసెసర్, 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చింది.
రియల్‌మి 3 బేసిక్ వేరియంట్ 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర రూ.8,999 కాగా, 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మరో ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. బ్లాక్, రేడియంట్ బ్లూ రంగుల్లో లభ్యం అవుతుంది. మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడుతుంది.
మొదటి మిలియన్ కొనుగోలుదారులకు మాత్రమే 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.8,999కు లభిస్తుందని రియల్‌మి తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే, రూ.500 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా జియోతో రూ.5,300 అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
రియల్‌మి3 ప్రత్యేకతలు:
6.2 హెచ్‌డీ+ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ70 ప్రాసెసర్,
3జీబీ +32జీబీ, 4జీబీ+64జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది,
13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
4,230 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.